- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమ పథకాలు అందించే ఏకైక పార్టీ కాంగ్రెస్…: పినపాక ఎమ్మెల్యే
దిశ,మణుగూరు : రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.పేదల గుండె చప్పుడే కాంగ్రెస్ పార్టీ అని,పేదలను అన్ని విధాలుగా ఆదుకునే పార్టీయే హస్తం పార్టీ అని కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం మణుగూరు మండలంలోని హనుమాన్ ఫంక్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిందని సందర్భంగా మండల అధ్యక్షుడు పిరినకి నవీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి,పాలాభిషేకం చేశారు.అనంతరం ముఖ్య నాయకులతో,కార్యకర్తలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయన్నారు.మహిళలకు ఉచిత బస్సు,200 యూనిట్లకు ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ,కింటా సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్,మరికొన్ని రోజులలో ఫ్యామిలీ కార్డు ఇలా అనేక పథకాలు ప్రజలకు అందజేస్తుందని తెలిపారు.
హస్తం పార్టీ ప్రజల నేస్తం పార్టీ చెప్పుకొచ్చారు. నియోజకవర్గ ప్రజల అండదండలతో పినపాక నియోజకవర్గన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో అనేక గ్రామాలలో ప్రజల సమక్షంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాలు పెట్టి ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని ప్రజల సమక్షంలోనే సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తానని తెలిపారు.పేద ప్రజలకు నిత్యం అండగా ఉంటానని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరరావు, నియోజకవర్గ సెక్రటరీ బీరం సుధాకర్ రెడ్డి,టౌన్ అధ్యక్షులు శివ సైదులు,సింగరేణి INTUC బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణం రాజు,బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య,మండల నాయకులు,మహిళ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.