'రైతు రుణమాఫీలో గందరగోళం తొలిగించాలి'.. బ్యాంకు ఎదుట రైతులు దర్నా

by Vinod kumar |
రైతు రుణమాఫీలో గందరగోళం తొలిగించాలి.. బ్యాంకు ఎదుట రైతులు దర్నా
X

దిశ, వైరా: ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ నేటికి పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో రైతుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని, 70 శాతం రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. సోమవారం వైరా ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు ఎదుట రైతులు రుణమాఫీ లో ఉన్న గందరగోళం తొలిగించి డిసెంబర్ 11 2018 నాటికి ఉన్న రైతులు లక్ష రూపాయలు రుణమాఫీ ఎలాంటి మినహాయింపు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ ఆశ చూపి ఓట్లు లబ్ది పొంది అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల పూర్తి అవుతు తిరిగి ఎన్నికలు తరుముకొస్తున్న రైతు రుణమాఫీ సంపూర్ణం గా అమలు చేయకుండా రైతులను గందరగోళం చేస్తున్నారు అని అన్నారు. మొదటి విడత లో ఇరవై ఐదు వేల, రెండోవ విడత యాభై వేల ప్రకటించిన రైతులకు కూడా రుణమాఫీ కాలేదని సెప్టెంబర్ రెండో వారం నాటికి సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అని అన్నారు. ప్రతి రోజు రైతులు బ్యాంకు లు చూటు తిరిగి విసిగిపోయిన పరిస్థితి దాపురించింది అన్నారు.

కేసీఆర్ మాట నమ్మి బ్యాంకు అప్పు చెల్లింపు చేసిన రైతులకు రుణమాఫీ కావడం లేదని, అప్పులు సకాలంలో చేల్లింపు చేయలేదని రైతులు అకౌంట్ నిలుపుదల లో ఉన్న రైతులకు బ్యాంకు అకౌంట్‌లో నమోదు అయిన రైతు పేరు, ఆధార కార్డ్‌లో పేర్లు అక్షర దోషాలను సాకుగా చూపి రైతు రుణమాఫీ డబ్బులు జమ చేయడం లేదని రుణమాఫీ లో ఉన్న గందరగోళ పరిస్థితుల్ల ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించి కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ సంపూర్ణం గా అమలు చేయాలి అని లేనిచో రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షులు మల్లెంపాటి రామారావు, మండల అధ్యక్షులు మేడా శరబంధి, కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు, సీపీఎం వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, రైతు సంఘం నాయకులు కురుగుంట్ల శ్రీనివాసరావు, పైడిపల్లి సాంబశివరావు, పారుపల్లి కృష్ణారావు, మాడపాటి మల్లికార్జున్, సంక్రాంతి పురుషోత్తం, పల్లెబోయిన కృష్ణ, కామినేని రవి, ఎస్ కె జానిమియా, ఇనపనూరి శ్రీనివాసరావు , తూము సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story