MLA మెచ్చాను మెచ్చిన CM KCR

by Mahesh |
MLA మెచ్చాను మెచ్చిన CM KCR
X

దిశ, అశ్వారావుపేట: బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ భారీ బహిరంగ సభకు ఖమ్మం వేదికయ్యింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సభ సక్సెస్ కోసం వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మంత్రి హరీష్ రావు భేటీ కావడం ఒకటి.. ఈ భేటీలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు కూడా మధుర అనుభవాలు మిగిల్చిందని చెప్పాలి.

ఆ సందర్భాన్ని ఆయన అభిమానులు ఇప్పటికింకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తుమ్మల నివాసానికి హరీష్ రావుతో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు వద్దిరాజు రవిచంద్ర, కౌశిక్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లు వచ్చారు. వీరందరికీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్యే మెచ్చా పై కేసీఆర్ కి ఉన్న సదాభిప్రాయం గురించి అక్కడ చర్చ జరిగింది.

మెచ్చాకు అగ్రనాయకత్వం పొగడ్తలు

సీఎం కేసీఆర్ సర్వేలో ఎమ్మెల్యే మెచ్చాకు మంచి మార్కులు వచ్చాయని.. పెద్దమనిషి(మెచ్చా)కి తన సర్వేలో బాగా వచ్చిందని కెసిఆర్ తనతో అన్నట్లు మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మెచ్చా తన నియోజకవర్గ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, ఆర్టీవో సబ్ యూనిట్ ఆఫీస్ ల కోసం పట్టుబడుతుంటారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట కలిపారు. మెచ్చాను సీఎం కేసీఆర్ పెద్దమనిషి అని గౌరవంగా పిలుస్తారని ఎంపీ నామా నాగేశ్వరరావు గుర్తుచేశారు.

సీఎం సర్వేపై మెచ్చా అభిమానుల హర్షం

అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ప్రశంసించడంతో ఆయన అనుచరులు, అభిమానులు పార్టీ కార్యకర్తలు తెగ మురిసిపోతున్నారు. వివాదాలు, రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ హుందాగా వ్యవహరించే తమ నాయకుడిపై సీఎం కేసీఆర్ లాంటి వారి దృష్టిలో సైతం అదే రకమైన భావన ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం సర్వేలో బాగా ఉందనడం మెచ్చా గ్రాఫ్ ఎంత బాగా ఉందో చెప్పడానికి నిదర్శనమని.. మరో మారు గెలుపు ఖాయమని గర్వంగా చెప్పుకుంటున్నారు.

మెచ్చా పై బిఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండటం.. సీఎంకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు పొగడ్తలతో ముంచెత్తడం అంశాలను పరిశీలిస్తే భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి దోహదపడే అవకాశాలు చాలా ఉంటాయని కూడా వారు అంచనాలు వేస్తున్నారు.

Also Read...

హైకోర్టును ఆశ్రయించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Next Story

Most Viewed