- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22 ఏళ్ల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
దిశ, తిరుమలాయపాలెం : వారు రెండు దశాబ్దాల తర్వాత కలిశారు. దాంతో వారంతా ఆనందంతో పులకించి పోయారు. పాఠశాల చదువు ముగిసి.. ఉద్యోగాల్లో కొందరు.. వ్యాపార, ఉపాధి బాటల్లో మరికొందరు స్థిరపడ్డారు. ఎక్కడెక్కడో వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా 22 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట ఒక్క చోటుకు చేరారు. ఈ అపురూప ఘట్టం ఆదివారం సుబ్లేడులో చోటు చేసుకుంది.
బాల్య జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ..
2002-2003 బ్యాచ్ కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులంతా ఇక్కడికి వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవడంతో ఎలా ఉన్నావ్..? ఏం చేస్తున్నావ్..? పిల్లలు.. వారి చదువుల గురించి పరస్పరం ఆరా తీసుకున్నారు. పాఠశాల ఆవరణమంతా కలియతిరిగి..ఆటపాటలతో కాలక్షేపం చేశారు.
బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ రోజుల్లో తమకు పాఠాలు చెప్పిన గురువులు వై. నాగేంద్రం, ఊషయ్య, లక్ష్మీ కుమారి, భాగ్యలక్ష్మి లను సత్కరించి ఆశీర్వాదం పొందారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ అందరూ కలుసుకోవడం పట్ల అటు ఉపాధ్యాయులు, ఇటు పూర్వ విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గ్రేహౌండ్స్ ఆర్ఐ గంధసిరి గురుమూర్తి, షేక్. ఇస్మాయిల్, నరేష్, బ్రహ్మచారి, వెంకన్న పాల్గొన్నారు.