Chicken prices: శ్రావణ మాసం ఎఫెక్ట్.. మరోసారి భారీగా తగ్గిన చికెన్ ధరలు

by Shiva |
Chicken prices: శ్రావణ మాసం ఎఫెక్ట్.. మరోసారి భారీగా తగ్గిన చికెన్ ధరలు
X

దిశ, వైరా: శ్రావణ మాసం ఎఫెక్ట్ మళ్లీ చికెన్ ధరలపై పడింది. బుధవారం మరోసారి చికెన్ ధరలు మరింత పడిపోయాయి. మరోవైపు సీజన్ వ్యాధులు చికెన్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత నెల 27 వరకు కిలో స్కిన్ చికెన్ ధర రూ.180, స్కిన్ లెస్ చికెన్ రూ.200లుగా ఉంది. గత నెల 28న కిలో స్కిన్ చికెన్ రూ.165, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.188కి పడిపోయింది. అంటే అప్పట్లో కిలో స్కిన్ చికెన్‌కు రూ.15 , స్కిన్లెస్ చికెన్‌కు రూ.12 ధర తగ్గింది. తాజాగా బుధవారం చికెన్ ధరలు మళ్లీ తగ్గాయి. మంగళవారం వరకు లైవ్ కోడి కిలో రూ.114 ఉండగా, స్కిన్ చికెన్ రూ.165, స్కిన్ లెస్ రూ.188గా ఉంది.

అయితే, బుధవారం లైవ్ కోడి ధర రూ.107, స్కిన్ చికెన్ రూ.155, స్కిన్ లెస్ రూ.177 పడిపోయింది. ఆగస్టు 5న ప్రారంభమైన శ్రావణ మాసం సెప్టెంబర్ 3న వరకు కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, వైరా మండల పరిధిలోని గ్రామాల్లో పేపర్ ‌ ప్రకటించిన ధర కంటే తక్కువ రేటుకు వ్యాపారులు చికెన్ విక్రయిస్తున్నారు. వైరా పట్టణంలో మాత్రం కిలో స్కిన్ చికెన్ రూ.180, స్కిన్ లెస్ చికెన్ రూ.200 చొప్పున పేపర్ ధర కంటే అధిక రేటుకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మధిర పట్టణంలో కిలో స్కిన్ చికెన్ రూ.160, స్కిన్ లెస్ చికెన్ రూ.180లకు విక్రయిస్తున్నారు.

Advertisement

Next Story