- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెను తక్షణమే కోర్టులో హాజరుపర్చాలి.. మావోయిస్ట్ పార్టీ వార్నింగ్
దిశ ప్రతినిధి, ఖమ్మం: పోలీసుల అదుపులో ఉన్న చర్ల మావోయిస్టు కమాండర్ రజితను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని, అదుపులో ఉన్నవారికి ఎలాంటి హాని తలపెట్టినా అధికార పార్టీ నాయకులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది.
సెప్టెంబర్ 7 తెల్లవారుజామున తెలంగాణ, ఛత్తీస్ గఢ్ పోలీసులు మూకుమ్మడిగా డోకుపాడు, కూర్ణపల్లి, కూనవాయి గ్రామాలపై దాడిచేసి అనారోగ్యంతో ఉన్న చర్ల మావోయిస్టు కమాండర్ రజిత, దనితో పాటు మరో నలుగురు దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. తక్షణమే పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు పార్టీ సభ్యులను కోర్టులో హాజరుపరచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. వారిని బూటకపు ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని, అరెస్ట్ చేసిన వారికి ఎలాంటి ప్రాణ హాని తలపెట్టినా ప్రభుత్వం, పోలీసులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Also Read : సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు