షార్ట్ సర్క్యూట్ తో సెల్ పాయింట్ దగ్ధం

by Nagam Mallesh |
షార్ట్ సర్క్యూట్ తో సెల్ పాయింట్ దగ్ధం
X

దిశ, కూసుమంచి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ సెల్ దుకాణం పూర్తిగా కాలిపోయిన ఘటన కూసుమంచి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. మండలంలోని లోక్య తండా గ్రామానికి చెందిన వడిత్య వీరబాబు(వికలాంగుడు) రోజు మాదిరిగానే దుకాణం మూసి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి దుకాణం సెట్టర్ నుండి మంటల వ్యాపించి పొగలు బయటకు రావడంతో దాన్ని గమనించిన పక్క షాపు టి దుకాణం వ్యక్తి సెల్ పాయింట్ యజమాని వీరబాబుకు సమాచారం అందించాడు. తన షాపు వద్దకు చేరుకున్న వీరబాబు పెద్ద మొత్తంలో విలువైనా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ ఇతరత్రా వివిధ కంపెనీల మొబైల్ స్పేర్ పార్ట్స్ అగ్నికి ఆహుతావటంలో ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఐదేళ్లుగా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story