ఎండైనా, వానైనా..రోడ్డుపైనే ఎదురుచూపులు..!

by Aamani |
ఎండైనా, వానైనా..రోడ్డుపైనే ఎదురుచూపులు..!
X

దిశ,జూలూరుపాడు : రోడ్డుపై బస్సు ఆగి కనిపిస్తున్న ప్రాంతం జూలూరుపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్. ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు మీదే నిల్చోవాల్సిన పరిస్థితి. బస్సులు కూడా రోడ్డు మీద ఆపుతున్నారు, ఇలా ప్రతి బస్సు రోడ్డు మీదే ఆపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేకపోవడంతో ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండైనా, వానైనా. రహదారిపై ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. జూలూరుపాడు మండల వ్యాప్తంగా ప్రజలు పట్టణాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై, కిరాణా దుకాణాల ఎదుట, రేకుల షెడ్డు కింద వేచి చూడాల్సిన దుస్థితి ఉంది..

ప్రయాణికులను పట్టించుకోని అధికారులు : ఎస్ కె నాగులుమీరా

మండలకేంద్రంలో బస్‌ షెల్టర్ నిర్మాణంపై ఆర్టీసీ అధికారులు కానీ ప్రజా పాలకులు, కానీ, ఏ మాత్రం పట్టించుకోవడం లేదు మండలం నుంచి నిత్యం వివిధ పనుల నిమిత్తం కొత్తగూడెం, ఖమ్మం, పట్టణాలకు కార్యాలయాల పనులు, ఆస్పత్రుల కోసం వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో చంటి పిల్లలతో కుటుంబ సభ్యులు ఎండలోనే వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో పాలకులు బస్టాండ్‌ నిర్మాణం కోసం హామీలు ఇచ్చినప్పటికీ పనులు ప్రారంభించలేదు.

పాలకులు మారినా ఎన్నాళ్లీ దుస్థితి..? : ఎదులాపురం గోపాల్ రావు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, మండల ప్రజలకు ఎన్నాళ్లు దుస్థితి నాయకులు అధికారుల హామీలతో ఇంకెంతకాలం ఈ కష్టాలు, రోడ్ల విస్తరణ పనులతో ఉన్న బస్సు షెల్టర్లను తొలగించి రోడ్డు పనులు పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు ప్రజల కోసం తాత్కాలిక బస్ షెల్టర్లు నిర్మించకపోవడంతో, బస్ షెల్టర్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed