- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, హరిప్రియ ముందస్తు అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం ఏన్కూరు లింక్ కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తారు. దీంతో గోదావరి జలాలు మరికొద్ది గంటల్లోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరనున్నాయి. పంప్ హౌజ్ ప్రారంభోత్సవం తర్వాత అనంతరం వైరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. ఆ సభలోనే రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిధులు విడుదల చేస్తారు. ఈ క్రమంలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు చేపట్టారు. సీతారామ ప్రాజెక్టుల ద్వారా భద్రాద్రి జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలంటూ నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బానోత్ హరిప్రియను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇక వైరా మండల కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.