తమ్మినేని నవీన్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్..

by samatah |   ( Updated:2022-09-12 05:58:42.0  )
తమ్మినేని నవీన్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్..
X

దిశ, ఖమ్మం రూరల్ : ఇటీవల సీపీఎం నాయకుల చేతిలో తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈక్రమంలో అతనికుమారుడు కుమారుడు నవీన్‌కు ఆదివారం రాత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేసి పరామర్శించారు. హత్య జరిగిన తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. పార్టీలకతీతంగా కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిసిన తరువాత ఖమ్మం వస్తానని చెప్పిన సంజయ్, తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. హత్య పై బీజేపీ లీగల్ సెల్ స్పందిస్తారని నవీన్‌కు ధైర్యం చెప్పారు.

Also Read: రోజుకు రూ.60 లక్షల ఖర్చు.. ప్రధాని బట్టలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story