- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Azadi Ka Gaurav Yatra: బీజేపీకి దేశ ప్రజలే బుద్ధి చెబుతారు : భట్టి విక్రమార్క
దిశ, కూసుమంచి: Bhatti Vikramarka Launches Azadi Ka Gaurav Yatra in Kusumanchi| స్వాతంత్ర ఉద్యమ ఆలోచనలను ప్రజలకు తెలియజేయడానికి, ఇతర దేశస్తుల మద్దతు కూడగట్టడానికి ఆనాడు నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయానికి బీజేపీ తాళాలు వేయించడం స్వాతంత్ర సంగ్రామాన్ని అవమానించడమేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పాలేరు నియోజకవర్గం కూసుమంచి శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆజాదీ కా గౌరవ్ యాత్రను మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌తో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం కూసుమంచిలో ఆయన మాట్లాడుతూ.. జాతిపితగా మహాత్మా గాంధీ ని ప్రపంచమే గౌరవిస్తుంటే గాంధీని చంపిన గాడ్సే వారసులు అధికారంలోకి వచ్చి గాంధీ సిద్ధాంతాన్ని అవమానించాడాన్ని తప్పుపట్టారు.
దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎలాంటి పాత్ర లేని బీజేపీ తామే స్వాతంత్రం తీసుకొచ్చినట్టుగా ప్రచార ఆర్భాటానికి పాల్పడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ కుటుంబ సభ్యులైన సోనియా, రాహుల్ పై కక్ష సాధింపునకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ నోటీసులు ఇప్పించి విచారణ పేరిట రోజుల తరబడి వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ పాలకులకు దేశ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
దేశ స్వాతంత్ర సంగ్రామంలో వేల మంది కాంగ్రెస్ నాయకులను బ్రిటిష్ పాలకులు అండమాన్ జైల్లో నిర్బంధించి అనేక చిత్ర హింసలు పెట్టి ప్రాణాలు తీశారని పేర్కొన్నారు. నీలిమందు వ్యతిరేకంగా బీహార్ రైతుల కోసం మహాత్మా గాంధీ మొదలుపెట్టిన సత్యాగ్రహం దేశ సంగ్రామానికి నాంది పలికిందన్నారు. దేశ స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు వారైనా పింగళి వెంకయ్య, గోకరాజు పట్టాభి సీతారామయ్య లాంటి పోరాట యోధులు కీలక భూమిక పోషించారని, స్వాతంత్ర పోరాటంలో తెలుగువారి చరిత్ర ఉందన్నారు. దేశానికి జెండాను అందించిన పింగళి వెంకయ్య ను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. పింగళి వెంకయ్య అందించిన జాతీయ జెండాకు ప్రతి ఒక్కరు వందనం చేయాల్సిందేనని తెలిపారు. ఆనాటి స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తిని ప్రజలకు వివరించడమే ఆజాదీ కా గౌరవ్ యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని వెల్లడించారు.
భారతదేశం అంటేనే కాంగ్రెస్.. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్
భారతదేశమంటేనే కాంగ్రెస్ అని కాంగ్రెస్‌ను దేశాన్ని వేరువేరుగా చూడలేమని మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ అన్నారు. కాంగ్రెస్ పోరాట ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. అభివృద్ధిలో ప్రపంచ దేశాలు తలదన్నే విధంగా భారత్ ఉండటానికి కాంగ్రెస్ చేసిన కృషి ఫలితమేనని వివరించారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కాంగ్రెస్ సిద్ధాంతం ఉంటుందన్నారు. నాయకులు పార్టీ వీడినంత మాత్రాన కాంగ్రెస్‌కు నష్టం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, కార్యకర్తలే బలం అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడతారని తెలిపారు. కూసుమంచి శివాలయం నుంచి కేశవపురం, జీళ్ల చెరువు, గోపాల్ రావుపేట, తల్లంపాడు, పొన్నేకల్, మద్దులపల్లి గ్రామాల్లో మొత్తం 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. 75 వ స్వాతంత్రం వజ్రోత్సవాల సందర్భంగా కూసుమంచిలి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును భట్టి విక్రమార్క కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాయకులు మాధవి రెడ్డి, శేఖర్ గౌడ్, వీరభద్రం, సౌజన్య, బంధయ్య, సంతోష్, మట్ట గురువయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎల్పీ నేత భట్టి ని కలిసిన విఆర్ఏలు
75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏఐసీసీ పిలుపు మేరకు కూసుమంచి శివాలయం నుంచి కేశవపురం వెళ్తున్న ఆజాదీ కా గౌరవ్ యాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ను వీఆర్ఏ లు కలిసి తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. తమ హక్కుల సాధన కోసం సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వివరించారు. తమ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరారు.
స్వాతంత్ర సమరయోధులకు సన్మానం..
ఆజాదీ కా గౌరవ్ యాత్రలో భాగంగా కూసుమంచి శివాలయం వద్ద స్వాతంత్ర సమరయోధులను తెలంగాణ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ఘనంగా సన్మానం చేశారు. స్వాతంత్ర సమరయోధులు చాగంటి నారాయణ, ఉన్నం వెంకయ్య, సోమ్లా నాయక్ తదితరులకు పూలమాలవేసి శాలువా కప్పి సత్కరించారు.