- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు… అల్లాడుతున్న విద్యుత్ వినియోగదారులు
దిశ, వైరా : వైరా మండలంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ కోతలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. వైరా మండలంలో ప్రతి రోజు అనేక సార్లు విద్యుత్ ట్రిప్ కావడంతో తమ గృహోపకరణాలు కాలిపోతున్నాయని విద్యుత్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో త్వరలో బదిలీలు ఉండటంతో అధికారులు పెండింగ్ పనులను చేసేందుకు తరుచు ఎల్సీ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అనేక విద్యుత్ లైన్లు, ఇతర పనులను అధికారులు తమ నిర్లక్ష్యం తో సంవత్సరాల పొడుగునా పెండింగ్ లో ఉంచారనే విమర్శలున్నాయి. తమ బదిలీల లోపు పనులు పూర్తి చేయకపోతే జీతాలు ఇవ్వకుండా బదిలీ అయిన ప్రాంతంలో ఇబ్బంది పెడతారని అధికారులు హడావుడిగా పెండింగ్ పనులు చేస్తున్నారు. గత నాలుగు నెలలుగా వైరా మండలంలో ప్రతిరోజు ఎన్నిసార్లు విద్యుత్ ట్రిప్ అయింది, ఎన్నిసార్లు ఎల్సీ లు తీసుకున్నారు అనే అంశమై లాగ్ బుక్ ను పరిశీలిస్తే ఉన్నతాధికారులకు ఇక్కడ పరిస్థితి అర్థం అవుతుంది. మరోవైపు ఎల్సీ తీసుకున్నప్పుడు ట్రిప్ అయినప్పుడు ప్రతిసారి లాగ్ బుక్ లో వివరాలను పొందుపరచటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
వైరా మండలంలోని వైరా, గరికపాడు సబ్ స్టేషన్ లలో ఉన్న ఫీడర్లకు ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే ఇక్కడ విద్యుత్ కోతలు ఏ స్థాయిలో ఉన్నాయో అధికారులకు అర్థమవుతుంది. యదేచ్చగా కొనసాగుతున్న విద్యుత్ కోతలతో ప్రభుత్వం బదనామవుతోంది. వైరా మండలంలో ఏ విద్యుత్ వినియోగదారుడు నోట విన్నా గత ప్రభుత్వంలో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉందని చెబుతున్నారంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఇలానే విద్యుత్ కోతలు కొనసాగితే అధికార పార్టీ కీర్తి ప్రతిష్టలు మరింత దిగజారే అవకాశం ఉంది. ఇప్పటికైనా జిల్లా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వైరా మండలంలో కొనసాగుతున్న విద్యుత్ కోతలను అరికట్టాలని విద్యుత్ వినియోగదారులు కోరుతున్నారు.