- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి స్థలం కబ్జాకు యత్నం
దిశ, కొత్తగూడెం : కబ్జాకు కాదేది అనర్హమని నిరూపిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఏకంగా సింగరేణి స్థలం నుండి ఒక రహదారినే ఏర్పాటు చేశాడు సదురు కబ్జాదారుడు. కొత్తగూడెంలోని ఆర్టీఏ ఆఫీస్ వెనుక భాగంలో గల సింగరేణి పాత క్వార్టర్లకు సంబంధించిన ప్రహరీ గోడని కూలగొట్టారు. ఒక వీధి నుండి మరొక వీధికి వెళ్లేందుకు దాన్ని రహదారిగా మార్చేశారు. ఏకంగా ఆ స్థలంలోకి వాహనాలు వెళ్లేందుకు ఒక రాంపును సైతం నిర్మించారు. ఆ స్థలంలో ప్రైవేటు వాహనాలను సైతం నిలుపుతున్నారు.
నెమ్మదిగా వాహనాలను నిలిపి ఎవరి దృష్టి దాని మీద పడకుండా ఉంటే ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. సింగరేణి ఉన్నతాధికారులు సింగరేణి ఆస్తులు, స్థలాలు కబ్దాదారుల నుండి కాపాడేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరో పక్క కబ్జాదారులు మాత్రం అత్యంత తెలివిగా, చాకచక్యంగా సింగరేణి స్థలాలను, ఆస్తులను కబ్జా చేస్తున్నారు. సింగరేణి అధికారులు కబ్జాకి గురవుతున్న ఈ స్థలంపై దృష్టి పెట్టి స్థలం చుట్టూ కబ్జాదారులు కూలగొట్టిన గోడ స్థానంలో ప్రహరీ నిర్మించి సింగరేణి ఆస్తులను కాపాడాలని పలు కార్మిక సంఘాలు కోరుతున్నాయి.