ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

by Sridhar Babu |
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, భద్రాచలం టౌన్ : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. ఆయన భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి వరదల వలన ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

కరకట్ట నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలని, 5 గ్రామపంచాయతీలు తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. భద్రాచలం అభివృద్ధి, ఇతర సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, కొండిశెట్టి కృష్ణమూర్తి, బోంబొతుల రాజీవ్, ఎండీ. నవాబ్, భోగాల శ్రీనివాస్ రెడ్డి, చుక్క సుధాకర్, భీమవరపు వెంకటరెడ్డి, బట్టా విజయ్ గాంధీ, గాడి విజయ్, ఆకుల వెంకట్, మాచినేని భాను, పుల్లగిరి నాగేంద్ర, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed