- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాడి పశువుల పెంపకానికి చేయూత
దిశ, బూర్గంపాడు : పాడి పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వ విద్యాలయల జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువుల పెంపకం అనేది కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను అర్జించవచ్చని తెలిపారు. ఒకప్పుడు పాడి రైతులు పశువులను పెంచాలంటే తెల్లవారుజామునుంచే మేత వేయటం పాలు పితకడం వంటి చాకిరీ ఉండేదని ఆయన అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది పాడి రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు.
ప్రభుత్వ పరంగా పాడి రైతులకు ఎన్నో రకాల ప్రోత్సాహాలను అందిస్తుందన్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పశు వుల షెడ్లకు, మేత పెంపకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందస్తున్నారు. కొంత అవగాహన రాహిత్యంతో రైతులు వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. ఏదైనా మనం సాధించాలంటే అది సొంత ఊరిలోనే ఆలోచనలు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో స్థలాలు, గోపాల మిత్రులు అందుబాటులో ఉంటే అక్కడ పశువైద్యశాల ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాడి రైతులకు అనేక సబ్సిడీ పథకాలను ప్రభుత్వం వర్తింపు చేస్తుందన్నారు. జిల్లాలో పాడి సంపదను పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
పాడి రైతులు పశువులకు సంక్రమించే వివిధ రకాల జబ్బుల విషయంలో వెంటనే పసికట్టి నిర్లక్ష్యం చేయకుండా చికిత్స అందించాలన్నారు. పాడి పశువులకు ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామాల్లో వాటిని మరింత విస్తరింపజేసేందుకు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. పశు వైద్య శిబిరాల నిర్వహణతో మరింత అవగాహన కలుగుతుందని, వీటిని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాడి రైతులు ప్రభుత్వం అందించే వివిధ రకాల పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బి.పురేందర్, పశుగణాభివృద్ధి అధికారి డాక్టర్ కిషోర్, సహాయ సంచాలకులు సత్యప్రసాద్, రవీంద్రనాథ్ ఠాగూర్, యూనివర్సిటీ ఉపా ధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.