పీసీసీ జనరల్ సెక్రటరీగా ఎడవల్లి కృష్ణ

by Javid Pasha |   ( Updated:2022-12-10 15:13:52.0  )
పీసీసీ జనరల్ సెక్రటరీగా ఎడవల్లి కృష్ణ
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: జిల్లాకు చెందిన ఎడవల్లి కృష్ణను పీసీసీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పీసీసీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు ఇచ్చిన సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి సక్రమంగా నిర్వర్తిస్తానని, కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తానని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యకు రుణపడి ఉంటానని ఎడవల్లి కృష్ణ స్పష్టం చేశారు.

Advertisement

Next Story