- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్మసీ సూపర్వైజర్ పై అదనపు కలెక్టర్ సీరియస్...
దిశ, ఖమ్మం : ఖమ్మం జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముందుల నిర్వహణపై అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ సీరియస్ అయ్యారు. గురువారం అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ జీజీహెచ్ ఆస్పత్రి ను సందర్శించారు. ఆసుపత్రి లో ఉన్న ఫార్మసీ విభాగంలో రికార్డులు సరిగా లేవని, ఫార్మసీ సూపర్వైజర్ పనితీరు పై అదనపు కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రోగులకు ఇచ్చే మందులు రికార్డులు సరిగా లేకపోవడం, ఏ మందులు కావాలో ఇంటెంట్ పూర్తి స్థాయిలో లేవు అని కలెక్టర్ దృష్టికి వచ్చింది.
దీంతో అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఫార్మసీ సూపర్వైజర్ ని చర్యలు తీసుకోవాలి గురువారం రాత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీచేశారు. అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు జీజీహెచ్ ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ శుక్రవారం షోకాజ్ నోటీసులను ఫార్మసీ సూపర్వైజర్ పద్మావతి కు అందించారు. ఈ షోకాజ్ నోటీస్ లో నవంబర్ నెల జీతం నిలుపుదల చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఫార్మసీ సూపర్వైజర్ పద్మావతి గతంలో ఎంజీఎం ఆసుపత్రిలో విధులు నిర్వహించేవారు, సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె ఖమ్మం జీజీహెచ్ ఆసుపత్రికి వచ్చారు.