అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ మృతులు 31 కాదు 34 : ఐజీ సుందర్ రాజ్

by Aamani |
అబూజ్ మడ్ ఎన్ కౌంటర్ మృతులు 31 కాదు 34 : ఐజీ సుందర్ రాజ్
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ , దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈ నెల 5వ తేదిన ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 34 మంది మావోయిస్టులు చనిపోయినట్లు బస్తర్ ఐ.జీ సుందర్ రాజ్.పి తెలిపారు. 31 మావోయిస్టు మృతదేహాలను స్వాధీనం చేసుకొనగా, మరో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఖననం చేసినట్లు ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.

Advertisement

Next Story