teacher suspended : విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఉపాధ్యాయురాలు..

by Sumithra |   ( Updated:2024-07-27 17:00:29.0  )
teacher suspended : విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఉపాధ్యాయురాలు..
X

దిశ, కల్లూరు : విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయురాలికి ఆ విద్యార్థుల ప్రవర్తన పై కోపం వచ్చింది. హోమ్ వర్క్ చేయట్లేదని, జుట్టుపెంచుకుని స్కూల్ కి వస్తున్నారని, చెప్పిన పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పిన కటింగ్ చేయించుకోకుండా వస్తున్నారని కోపంతో ఆ విద్యార్థులకు తానే బార్బర్ అవతారం ఎత్తి కత్తెరతో జుట్టు కత్తిరించింది. ఈ సంఘటన కల్లూరు మండలం పెరువంచ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పేరువంచ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు శనివారం ఉదయం స్కూల్లో సుమారు 15 మంది విద్యార్థులకు జుట్టు కత్తిరించి తలంతా గాట్లు గాట్లుగా పెట్టి పైశాచిక ఆనందం పొందింది. తలంతా గాట్లు పెట్టుకుని ఇంటికెళ్లిన విద్యార్థులను చూసిన తల్లిదండ్రులు విస్మయానికి గురైనారు. విషయం తెలిసున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేశారు. విద్యార్థులకు పెనుకోరుకుడు కటింగ్ చేసిన ఉపాధ్యాయిరాలిని నిలదీశారు. అవమాన భారంతో ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులని ఆ టీచర్ అలా చేస్తుంటే మిగతా ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు.

టీచర్ వివరణ..

పేరెంట్స్ మీటింగ్ లో ఎన్నిసార్లు చెప్పిన కటింగ్ చేయించుకోకుండా వస్తున్నారని, హోంవర్క్ చేయట్లేదని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, క్రమశిక్షణ లేకుండా ఉంటున్నారని అందుకే జుట్టు కత్తిరించ వలసి వచ్చిందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడం వల్ల చేసిన తప్పు తెలుసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పారు.

ప్రధానోపాధ్యాయులు వివరణ కోరగా..

ఆ సమయంలో తాను సెవెంత్ క్లాస్ విద్యార్థులకు క్లాస్ చెప్తున్నాను అని క్లాస్ అయిపోయిన తర్వాత బయటికి వస్తే విషయం తెలిసిందన్నారు. సంబంధిత ఉపాధ్యాయురాలు విద్యార్థులకు అలా కటింగ్ చేయడం తప్పేనని, ఈ విషయం పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

అవమానానికి గురైన విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ....

దేవుడికి మొక్కు ఉందని చెప్పినా వినకుండా తలంతా గాట్లుగాట్లుగా కత్తిరించారని కావాలనే మా జుట్టు కత్తిరించారని ప్రధాన ఉపాధ్యాయులు వారికి జుట్టు కత్తిరించిన విషయం తెలిపితే క్యాప్ పెట్టుకుంటే కవర్ అవుతుందని అన్నారని తెలిపారు.

ఎంఈఓ వివరణ కోరగా....

విద్యార్థుల జుట్టుకత్తిరించిన విషయం తన దృష్టికి రాలేదని అందుబాటులో లేనని అన్నారు. తన దృష్టికి వస్తే ఈ విషయంపై, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి సంబంధిత ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకుంటానని తెలిపారు.

ఉపాధ్యాయురాలును సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు..

9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో జెడ్పీఎస్‌ఎస్‌ పెరువంచ ఉపాధ్యాయురాలు అసభ్యంగా ప్రవర్తించిందని, శిక్షగా దాదాపు 15 మంది విద్యార్థులకు కటింగ్ చేసిన విషయం వాస్తవమే అని తెలుసుకొని APCS (CCA) రూల్స్, 1991లోని రూల్ 8 (1) (a) ద్వారా సస్పెన్షన్ చేస్తున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ఉపాధ్యాయురాలికి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story