- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుప్త నిధుల పేరిట మోసానికి స్కెచ్: భగ్నం చేసిన పోలీసులు
హిజ్రాగా మారిన కొడుకు కోసం తల్లి తాపత్రయం
దిశ, అశ్వారావుపేట: హిజ్రాగా మారిన తన కొడుక్కి దెయ్యం పట్టిందని క్షుద్ర పూజల్లోకి దింపి ఓ మహిళ వద్ద బంగారాన్ని కాజేయాలనే చూసిన దుండగుల స్కెచ్ ను పోలీసులు భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండున్నర సంవత్సరాల క్రితం హిజ్రాగా మారాడు. తల్లి తన కొడుకుని తిరిగి మామూలు మనిషిగా చేయించాలనే ఉద్దేశంతో మూఢ నమ్మకంతో పూజలు చేసే కొందరి వ్యక్తులను సంప్రదించింది. ఆమె అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న సదురు వ్యక్తులు.. నీ కొడుక్కు శంకిని దెయ్యం పట్టడం వల్లే హిజ్రాగా మారాడని నమ్మించారు.
అందుకు విరుగుడుగా క్షుద్ర పూజలు నిర్వహించి ఇంట్లో గొయ్యి తీసి శంకిని దయ్యాన్ని అందులో పూడ్చి పెడతామని మాయమాటలు చెప్పారు. అనుకున్నట్టుగానే ఇంటి గదిలో గొయ్యి తవ్వడం ప్రారంభించిన తర్వాత అక్కగే గుప్త నిధులు కూడా ఉన్నాయని బాధితురాలిని నమ్మించారు. ఆ బంగారం కావాలంటే అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహించాలని తెలిపారు. అందుకు 150 గ్రాములు బంగారం ముందుగా వారికి ఇవ్వాలని మాయమాటలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎస్సై రాజేష్ కుమార్ ఘటన స్థలికి చేరుకొని క్షుద్ర పూజలకు ఆశ్రయించిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి జరగబోతున్న మోసం పట్ల అవగాహన కల్పించారు. క్షుద్ర పూజలు చేస్తామని నమ్మబెలికే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
- Tags
- Hidden funds