- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలి
దిశ, ఖమ్మం సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఖమ్మం జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని సారథినగర్ లో ఎన్యుమరేటర్లు, అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ జరుగుతున్న ఇంటింటి సర్వే ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు విజయవంతంగా నిర్వహించాలని అన్నారు.
సర్వే జరిగే సమయం సంబంధిత ప్రజలకు ముందుగానే తెలిసేలా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. సర్వేను సకాలంలో ప్రారంభించాలని, ప్రతి కుటుంబం వద్ద సంపూర్ణంగా వివరాలను ఎటువంటి పొరపాట్లు లేకుండా సేకరించాలని, ప్రజల నుంచి సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు తప్పులు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే కారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు కట్ కావని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.