గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

by Aamani |
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
X

దిశ,మాడుగులపల్లి : మాడుగులపల్లి మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ అవుట్ పాల్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మాడుగులపల్లి ఎస్సై ఎస్ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం మండలం లోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ ఔట్ పాల్ వద్ద 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ మెరూన్ కలర్ టాప్ రెడ్ కలర్ లెగ్గిన్ దుస్తులు గల మహిళ పెద్దదేవులపల్లి రిజర్వాయర్ లో కొట్టుకొని వచ్చినట్లుగా గుర్తించారు.

ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్రమత్తమైన మండల పోలీసు సిబ్బంది స్పందించి వెంటనే వెళ్లి పరిశీలించగా మహిళ నీళ్లలో పడి రెండు మూడు రోజులైనట్టుగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మహిళా ఆచూకీ తెలిసినవారు 8712670192,8712670151 నెంబర్ లకు సమాచారం ఇవ్వగలరని ఎస్సై మాడుగులపల్లి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed