- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Seerat Kapoor: యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్న యంగ్ హీరోయిన్.. ఫస్ట్ లుక్ రిలీజ్
దిశ, సినిమా: టాలీవుడ్ నటి సీరత్ కపూర్ (Seerat Kapoor) ‘రన్ రాజా రన్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించిన మెప్పించిన ఈమె గతేడాది ‘భామాకలాపం-2, మనమే, ఉషా పరిణయం’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు సీరత్ కపూర్ తన తదుపరి చిత్రంతో బిజీగా ఉంది. ఈ యంగ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ (Action thriller) మూవీకి తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్ అగస్త్య (Naresh Agastya), జేడీ చక్రవర్తి (JD Chakraborty) కీలక పాత్రలో కనిపించనుండగా.. శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాకు త్రిష (Trisha) ప్రెజెంటర్‌గా, మల్కాపురం శివ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. రిలీజ్ చేసిన పోస్టర్‌లో సీరత్ కపూర్, నరేష్ అగస్త్య, జేడీ చక్రవర్తి లుక్ థ్రిల్లింగ్‌గా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ మూవీలో సీరత్ కపూర్ పాత్ర కథకు కీలకమైనది అని తెలుస్తుండగా.. ఈ కథలో ఎన్నో మలుపులతో పాటు మిస్టరీ కూడా ఉండనుందని టాక్.