SSMB29: పూజ ఫొటోలైనా రిలీజ్ చెయ్యండయ్యా!.. ‘SSMB29’పై ఫ్యాన్స్ రియాక్షన్

by sudharani |   ( Updated:2025-01-02 15:47:18.0  )
SSMB29: పూజ ఫొటోలైనా రిలీజ్ చెయ్యండయ్యా!.. ‘SSMB29’పై ఫ్యాన్స్ రియాక్షన్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), ద‌ర్శక దిగ్గజం ఎస్‌.ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli) కాంబోలో ‘SSMB29’ వస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ (Hollywood) సినిమాను త‌ల‌పించేలా ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని రాజ‌మౌళి ‘SSMB29’పై ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండ‌బోతుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందా అని అటు ప్రిన్స్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ (Lovers) ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రామ‌లు జ‌రుపుకున్నట్లు తెలుస్తుంది.

గురువారం ఈ మూవీకి సంబంధించిన వేడుక హైద‌రాబాద్‌(Hyderabad)లో జరిగిన‌ట్లు వార్తలు వ‌స్తున్నాయి. మ‌హేశ్ బాబు ఫ్యామిలీ, రాజ‌మౌళి ఫ్యామిలీతో పాటు ప‌లువురు సినీ ప్రముఖులు ఈ వేడుక‌కు హాజ‌రవ్వగా.. ప్రైవేట్‌గా ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసిన‌ట్లు తెలుస్తుంది. అయితే.. దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం రిలీజ్ చేయలేదు చిత్ర బృందం. దీంతో.. ‘పూజ ఫొటోలైనా రిలీజ్ చెయ్యండయ్యా!’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. యాక్షన్ అడ్వెంచర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రూ.1000 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్ న‌టించ‌బోతున్నట్లు సమాచారం.

Read More ....

SS రాజమౌళి నోట ‘OG’ మాట


Advertisement

Next Story

Most Viewed