- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యను అగ్రశ్రేణిలో నిలపడానికి అంకుఠిత దీక్ష పూనాము : ఎమ్మెల్యే యెన్నం
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : విద్యా రంగంలో మహబూబ్ నగర్ ను అగ్రశ్రేణిలో నిలపాలన్న అంకుఠిత దీక్షతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సరస్వతి నిలయమైన మహబూబ్ నగర్ జిల్లా పదేళ్ళలో విద్యా పరిణామాలు పడిపోయాయని ఆయన ఆవేదన చెందారు.పేరుకు మాత్రమే కాస్తా అక్షరాస్యత పెరిగినా,చదువులో అది లేదన్నారు.రంగారెడ్డి జిల్లాతో పోల్చితే,ఉపాధి,ఉద్యోగం అవకాశాలలో మన జిల్లా చాలా వెనకబడిపోయిందని ఆయన విచారం వ్యక్తంచేశారు.
జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని,అందులో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ను అందించడంతో 23 శాతం ఫలితాలు పెరిగాయని,నియోజకవర్గంలోని 40 ఉన్నత పాఠశాలలో డిజిటల్ బోర్డు లను ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను ఇప్పించామన్నారు.అంతేకాకుండా ప్రతి ఆదివారం ప్రభుత్వ హాస్టల్స్,కళాశాలలు,పాఠశాలలో శ్రమదానంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,బీఈడీ కళాశాలలో గత 50 ఏండ్లలో సాధ్యంకానిది 15 రోజుల్లో నాయకులు,కార్యకర్తలతో కలిసి మహిళలకు టాయిలెట్లు నిర్మించామని,సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కోటి యాభై లక్షల పనులు చేయడానికి హామీ ఇచ్చామని ఆయన తెలిపారు.
మహబూనగర్ జిల్లాలో విద్యను అభివృద్ధి చేయడానికి 'విద్యా నిధి' ఏర్పాటు చేసినట్లు,కలెక్టరెట్ ఎస్బీఐ లో 43676342719 నెంబర్ తో అకౌంట్ తెరిపించామని,తన జీవిభత్యాల నుండి ప్రతినెల రూ.1 లక్ష ను 'విద్యా నిధి అకౌంట్లో' జమ చేస్తానని,అలా నాలుగు సంవత్సరాలలో 50 లక్షలు పోగు చేసి విద్యాభివృద్ధికి పాటుపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.పట్టణంలోని ప్రముఖులు,వ్యాపారస్థులు,ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎవరైనా విద్యా నిధి అకౌంట్లో డొనేషన్లు ఇచ్చి మా ప్రయత్నానికి అండగా నిలవాలని,ఈ విద్యా నిధి ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సిపిఓ నిర్వహిస్తారని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో టిపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్,మూడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్,గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహారెడ్డి,సిరాజ్ ఖాద్రీ,మహేందర్,రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.