ఆయన నిజంగా అదృష్టవంతుడే..

by Sumithra |
ఆయన నిజంగా అదృష్టవంతుడే..
X

దిశ, వైరా : కొన్ని సంఘటనలు జరిగిన తీరుచూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనం రోడ్డు పై ఎంత జాగ్రత్తగా వెళ్తున్నప్పటికీ కాలం కలిసి రాకపోతే ప్రమాదం ఏ రూపంలోనైనా పొంచి ఉంటుందన్న దానికి ఈ సంఘటన ఉదాహరణ. అయితే అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించటం ప్రతి ఒక్కరికి తప్పనిసరి. వైరా మండలంలోని గొల్లపూడి, గొల్లెనపాడు గ్రామాల మధ్య మంగళవారం రోడ్డు పై వెళ్తున్న ట్రాక్టర్ పై అకస్మాత్తుగా తాటిచెట్టు పడింది. గొల్లెనపాడు గ్రామానికి చెందిన కందుల సత్యం తన ట్రాక్టర్ ను నడుపుకుంటూ గొల్లపూడి గ్రామం నుంచి గొల్లెనపాడుకు వెళ్తున్నాడు. గొల్లపూడి, గొల్లెనపాడు గ్రామాల మధ్య రోడ్డు పై వెళ్తున్న ట్రాక్టర్ కు పెనుప్రమాదం తప్పింది.

ఈ ట్రాక్టర్ పై అకస్మాత్తుగా తాటి చెట్టు కుప్పకూలింది. ట్రాక్టర్ బానేట్ పై తాటిచెట్టు కుప్పకూలటంతో వెంటనే ట్రాక్టర్ నడుపుతున్న కందుల సత్యం సమయస్ఫూర్తితో ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. లేకుంటే ట్రాక్టర్ పై కుప్పకూలిన తాటిచెట్టు డ్రైవర్ సీట్ లో ఉన్న అతని మీదకు దూసుకు వెళ్లి ప్రమాదం సంభవించి ఉండేది. ఈ ప్రమాద సందర్భంగా సత్యం వ్యవహరించిన సమయస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు సత్యంను ఉద్దేశించి ఆయన నిజంగా అదృష్టవంతుడిని కొంతమంది, ఆయనకు భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉన్నాయని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Next Story