- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ కు 300 మంది పొంగులేటి వర్గీయులు రాజీనామా..
దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన 300 మంది పొంగులేటి వర్గీయులు మంగళవారం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అశ్వారావుపేట పొంగులేటి ముఖ్య అనుచరుడు ముఖ్యఅనుచరుడు జారే ఆదినారాయణ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను ఎటువంటి నోటీసులు అందించకుండా సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అందుకుగాను మండలంలో ఉన్న 300 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైపు నడుస్తామని ప్రకటించారు.
2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి 14 వేల ఓట్లు సాధించామన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి తనకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదని తెలిపారు. కనీసం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పదవి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తనను ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కున చేర్చుకొని రాజకీయాల్లో ముందు తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
అప్పటి నుండి ఆయనతోనే నా ప్రయాణం కొనసాగిస్తున్నాననీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనను అనేకసార్లు అవమానించారని, కింది స్థాయి నాయకులందరినీ స్టేజి మీదకు ఆహ్వానించి తనను అనేకసార్లు స్టేజి మీద కూడా పిలవక పోవడంతో ఎన్నోసార్లు బాధపడ్డానని తెలిపారు. అయినప్పటికీ పార్టీ కోసం పనిచేయాలన్న ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని నియోజకవర్గంలో 45 వేల బీఆర్ఎస్ సభ్యత్వాలు పూర్తి చేశానని తెలిపారు. రాబోయే రోజుల్లో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి అభిమానులమంతా కట్టుబడి ఉంటామని వ్యాఖ్యానించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బలంతో ఎంతోమంది నాయకులు గెలిచి, ఇప్పుడు పొంగులేటి పైన విమర్శలు చేయడం దారుణమన్నారు.
తిన్నింటి వాసాలు లెక్కించినట్లుగా వారి ప్రవర్తన ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిమండలం నుండి భారీ స్థాయిలో పొంగులేటి వర్గీయులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారని తెలిపారు. రాజీనామా చేసిన వారిలో గండుగులపల్లి సర్పంచ్ మడకం సుశీల, ఎంపీటీసీలు నాయుడు శ్రీను, కోటగిరి సత్యవతి, పొంగులేటి ముఖ్యఅనుచరులు రావు గంగాధరరావు, కోటగిరి సత్యంబాబు, చిన్న శెట్టి యుగంధర్, చామర్తి గోపిశాస్త్రి, సాయి నరసింహారావు, రావు పండు, మడకం రాజేష్, ఈశ్వర్ ప్రగడ నాగభూషణ్, చెక్కిలాల మల్లేశ్వరరావు, ఎర్రగొర్ల రాధాకృష్ణతో పాటు వార్డ్ మెంబర్లు, గ్రామశాఖ అద్యక్షులు, రాజీనామా చేశారు.