- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు
దిశ, క్రైం బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో వెస్ట్ జోన్ డీసీపీ విజయకుమార్ సారథ్యంలో మరో కీలక ముందడుగు పడింది. ఇటీవల డీసీపీ విజయకుమార్ దర్యాప్తులో ఎవరి పాత్ర ఉన్నట్లు తెలిసిన, వారు ఎంతటి వారైనా, రాజకీయ ప్రముఖులైనా సరే, ఇంకా ఏ రంగాలకు చెందిన వారైనా సరే వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి మా జీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, మీడియా ఛానల్ యజమాని శ్రావణ్ కుమార్‌లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.
అమెరికాలో ఉన్న ఈ నిందుతులకు రెడ్ కార్నర్ నోటీసులు అందించేందుకు ఇంటర్ పోల్‌కు అనుబంధంగా మన దేశంలో ఎన్‌సీబీ (నేషనల్ సెంట్రల్ బ్యూరో) అధికారులు, సీబీఐతో సమన్వ యం చేస్తున్నారు. ఇలా ప్రయత్నం చేసి నిందితులకు త్వరగా రెడ్ కార్నర్ నోటీసులు అందేలా పని చేస్తున్నారు. ఆ అమెరికా, భారత్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఉన్న మార్గదర్శకాలను అనుసరించి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ సమయంలో నిందితులకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసారా ప్రశ్నకు పోలీసులు ఈ వివరాలను జవాబుగా చెప్పినట్లు తెలిసింది.