సీఎం జగన్‌కు నాలుగు సీట్లు కూడా రావడం కష్టమే.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

by Javid Pasha |
సీఎం జగన్‌కు నాలుగు సీట్లు కూడా రావడం కష్టమే.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటలకు దీక్షకు దిగగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మోత్కుపల్లి దీక్షను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీక్షకు అనుమతి లేదని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు . దీంతో పోలీసులతో మోత్కుపల్లి కాసేపు వాదించగా.. అనుమతి లేదని చెప్పినా మోత్కుపల్లి దీక్షలో కూర్చున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌పై మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. రాబోయే రోజుల్లో జగన్‌కు నాలుగు సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్దమని, ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని విమర్శించారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఆయనకు జగన్ క్షమాపణలు చెప్పాలని వ్యాఖ్యానించారు. అసలు ఏ ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని మోత్కుపల్లి ప్రశ్నించారు. కాగా నిన్న ఎన్టీఆర్ ఘాట్‌ను మోత్కుపల్లి సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌ అప్రజాస్వామికంగా జరిగిందని ఆరోపించారు. రాజకీయ కక్షలో భాగంగానే బాబును జగన్ అరెస్ట్ చేయించారని విమర్శించారు.

Read More: చంద్రబాబు ఫ్యామిలీని చంపేందుకు కుట్ర: మాజీమంత్రి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed