రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసుల్లో కీలక విషయాలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-16 08:43:18.0  )
రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసుల్లో కీలక విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 19 న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. కాగా నోటీసుల్లో పలు కీలక విషయాలను ఈడీ ప్రస్తావించింది. 2021లో బెంగళూరు పోలీసుల కేసు ఆధారంగా రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వ్యాపార వేత్త కళహర్ రెడ్డితో కలిసి బెంగళూరులో డ్రగ్స్ పార్టీకి రోహిత్ రెడ్డి వెళ్లినట్లు తెలిపింది. నిర్మాత శంకర గౌడ ఈ డ్రగ్స్ పార్టీ ఇచ్చినట్లు నోటీసుల్లో పేర్కొంది. ఈ పార్టీ కోసం రూ. 4కోట్ల డ్రగ్స్ తెప్పించినట్లు ఈడీ తెలిపింది. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు బెంగళూరు పోలీసులు తేల్చారు. పార్టీలో డ్రగ్స్ తీసుకున్న మస్తాన్, శంకర గౌడను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇదే అంశంలో హీరో తనీష్‌ను ఈడీ విచారించింది. కాగా రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఈడీ వివరణ కోరనుంది. రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పొలిటికల్ వర్గాల్లో దుమారం రేగింది.

Advertisement

Next Story

Most Viewed