- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీ.కాంగ్రెస్.. ఢిల్లీలో కీలక సమావేశం
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల సన్నద్దతపై తెలంగాణ సమన్వయకర్తలతో పార్టీ అగ్ర నేతలైన ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహాలు గైర్హాజరు అయ్యారు.
ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు కో-ఆర్డినేటర్లను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టేలా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. 17 స్థానాలకు 17 స్థానాలను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా వర్క్ స్టార్ట్ చేసింది.