- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీభవన్‌లో పీసీసీ కీలక భేటీ!
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే హజరయ్యారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్‌తో పాటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు ఈ భేటీకి ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. అయితే నిన్న జరిగిన భేటీలో మాణిక్ ఠాక్రే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.
నాయకత్వం, ఐక్యత కాంగ్రెస్ పార్టీ బలాలని, అందరూ విభేదాలు వీడి కలిసి పని చేయాలని సూచించారు. ఈ నెల 26 నుంచి రెండు నెలల పాటు చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని గడపగడపకు చేరవేయాలని ముఖ్య నేతలకు సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రజాఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా కాంగ్రెస్ పీసీసీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read...
రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి మీటింగ్.. కీలక నేత భవితవ్యంపై సస్పెన్స్!