- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొన్నాల రాజీనామాపై కాంగ్రెస్ రియాక్షన్.. నేతలకు కీలక ఆదేశాలు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. బీసీలకు టికెట్లు ఇవ్వడం లేదనే కారణంతో పాటు పార్టీలో రెండేళ్లుగా తనను అవమానిస్తున్నారంటూ పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మీడియా ముందే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పొన్నాల రాజీనామా కీలకంగా మారింది.
పొన్నాల రాజీనామా నేపథ్యంలో నేతలకు కాంగ్రెస్ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన రాజీనామాపై ఎవరూ స్పందించవద్దని అంతర్గతంగా ఆదేశాలిచ్చింది. నేతలు ఎవరూ అసలు మాట్లాడవద్దని తెలంగాణ నేతలకు సూచించింది. జనగామ టికెట్‌పై పొన్నాల ఆశలు పెట్టుకున్నారు. కానీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి టికెట్‌పై కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పొన్నాలకు సీటు వచ్చే అవకాశం లేకపోవడంతో అసంతృప్తితో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.