Hyderabad: నగర వాసులకు బిగ్ అలర్ట్..డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నారా?

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-15 16:10:31.0  )
Hyderabad: నగర వాసులకు బిగ్ అలర్ట్..డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన వర్షం 8:30 దాటినా ఆగలేదు. దీంతో రోడ్లపైకి వర్షం నీరు చేసింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోయిన్‌పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, అమీన్ పూర్, అమీర్‌పేట్, హైటెక్ సిటీ, నాంపల్లి, ఖైరతాబాద్, అసెంబ్లీ, లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం సహా పలు ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోంది.

గత రెండు గంటల నుంచి వర్షం పడుతుండగా.. మరో రెండు గంటలపాటు అది కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అయితే నాన్‌స్టాప్ వర్షంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయం కావడంతో నగరవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు వరదనీటిని తొలగించేందుకు మ్యాన్‌హోల్స్ ఓపెన్ చేస్తున్నారు. దీంతో ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్లేవారు జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరికలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed