ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం.. 60 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని సీఎం ఆదేశం

by Mahesh |   ( Updated:2024-10-09 10:28:01.0  )
ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం.. 60 రోజుల్లో రిపోర్ట్ సమర్పించాలని సీఎం ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీలతో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయా సబ్ కమిటీలకు చెందిన మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అలాగే సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని.. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story