కాసేపట్లో కుమారుడి ఎంజేగ్మెంట్‌.. YS షర్మిల కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
కాసేపట్లో కుమారుడి ఎంజేగ్మెంట్‌.. YS షర్మిల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లోని గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నిశ్చితార్థ మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ క్రమంలో రిసార్ట్ వద్ద తన అభిమానులతో షర్మిల మాట్లాడారు. తెలంగాణ వేదికగా తాను స్థాపించిన వైఎస్‌ఆర్‌టీపీ ఎక్కడికీ పోలేదని.. కాంగ్రెస్‌ పార్టీలోనే భాగమై ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి వేడుకలో అంతా సంయమనంగా ఉండాలని కోరారు. కాగా, ఇప్పటికే ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులైన విషయం తెలిసిందే. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ శుభకార్యానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story