- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ జిల్లాలో ఎప్పుడైనా బీఆర్ఎస్‌కు ఒకే సీటు వస్తుంది: కడియం శ్రీహరి
దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో గొప్ప గొప్పవని భావించిన అనేక పార్టీలు, వ్యక్తులు ఓడిపోయారని.. గెలుపోటములు సహజం అని అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అందుకే తాము ప్రశ్నించడం మొదలు పెట్టామని అన్నారు. తమకేం తొందరపాటు లేదని స్పష్టం చేశారు. ఖమ్మంలో ఎప్పుడైనా బీఆర్ఎస్‌కు ఒకే సీటు వస్తుందని.. ఎక్కడ లోపం జరుగుతుందో సమీక్ష చేసుకోవాలని అన్నారు.
అమలుకు సాధ్యం కానీ గ్యారంటీలను కాంగ్రెస్ ఇచ్చిందని.. నెలరోజుల్లోనే ఈ విషయం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. అనంతరం ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఖమ్మంలో ఈ సారి కచ్చితంగా నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుస్తామనుకున్నాం.. కానీ ఒక్క సీటే గెలిచాం ఎందుకిలా జరుగుతుందో ఆలోచిస్తున్నామన్నారు. గత పదేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలోని ఏ రాష్ట్రంలో జరుగలేదని అన్నారు. కేసీఆర్ ప్రతిక్షణం తెలంగాణ కోసమే తపించే వ్యక్తి అని చెప్పారు.
Read More..
ముచ్చటగా మూడో సారి జిల్లాలో ఒక్క సీటే.. అయినా.. మనిషి మారలేదు..