Ponnam Prabhakar: అలాంటి వాళ్లంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు

by Gantepaka Srikanth |
Ponnam Prabhakar: అలాంటి వాళ్లంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు
X

దిశ, వెబ్‌డెస్క్: కులగణనకు బీజేపీ(BJP) అనుకూలమా? కాదా? అని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్(Telangana Congress) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న కులగణన సర్వేపై రాష్ట్ర బీజేపీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్(MP Laxman) తన అభిప్రాయం చెప్పాలని అడిగారు. సర్వేను అడ్డుకోవాలని చూస్తే ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. బీజేపీ నేతల తీరు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో సర్వేను బీఆర్ఎస్(BRS) పారదర్శకంగా చేపట్టలేకపోయిందని విమర్శించారు. రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి(Kishan Reddy) హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేస్తామని తాము ఏనాడూ చెప్పలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed