మిరపకాయ ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
మిరపకాయ ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మహబూబాబాద్‌లో కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని లిల్లీఫుట్ అంటున్నారని మండిపడ్డారు. వరంగల్ మిరపకాయ సంగతి మీకు తెలుసు అన్నారు. సమయం చూసి మిరపకాయ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ చిప్పకూడు తినే రోజు త్వరలోనే రాబోతోందని వార్నింగ్ ఇచ్చారు.

దేశాన్ని పదేళ్లు ఏలిన బీజేపీ సర్కార్.. తెలంగాణను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు.. ఆ మాట మాట్లాడేందుకు కేసీఆర్‌కు సిగ్గుండాలని సీరియస్ అయ్యారు. ఏం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరుతారు అని విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశం చేశారు.. తాము ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తున్నామని అన్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి అందరి స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. కాగా, గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో తమతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement

Next Story