లోక్ సభ ఫలితాల తర్వాత తెరపైకి కిషన్ రెడ్డి కొత్త ఫార్ములా.. అధికారమే లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |
లోక్ సభ ఫలితాల తర్వాత తెరపైకి కిషన్ రెడ్డి కొత్త ఫార్ములా.. అధికారమే లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచి అధిక స్థానాల్లో గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రజలు 35 శాతానికి పైగా ఓట్లు వేస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కేవలం ఒక శాతం మాత్రమే ఓటు పర్సంటేజ్ పెరిగిందన్నారు. అనేక స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని ధ్వజమెత్తారు. లోక్ సభ ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఉండాలని ప్రజలే భావిస్తున్నారని అర్థం అవుతున్నదన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో 8, లోక్ సభ ఎన్నికల్లో 8 స్థానాలను గెలిచామని వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు మోడీ నాయకత్వాన్ని విశ్వసించారని అన్నారు. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి షిప్ట్ కావడం వల్లే బీజేపీ గెలిచిందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటమి బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన చేసిన ఆరోపణలే నిజమైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన అనేక సెట్మెంట్లలో కాంగ్రెస్ కు మెజారిటీ ఎందుకు తగ్గిందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని అందుకే ఆ పార్టీకి చెందిన ఓటర్లు కూడా మాకే ఓటు వేశారన్నారు.

47 చోట్ల మాదే ఆధిక్యం:

తెలంగాణలో మొత్తం 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యత లభించిందన్నారు. బీఆర్ఎస్ 14 చోట్ల మూడో స్థానానికే పరిమితమైందని కంచుకోట మెదక్ లో బీఆర్ఎస్ వందల కోట్లు ఖర్చుపెట్టినా బీజేపీ విజయం సాధించిందన్నారు. నిలబడ్డారన్నారు. సికింద్రాబాద్ లో వాస్తవంగా పోటీ చేసింది కాంగ్రెస్ కాదని కాంగ్రెస్ గుర్తుపై మజ్లీస్ పార్టీ పోటీ చేసిందని ఎంఐఎం బాధ్యత తీసుకుని బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లోనూ బీజేపీ సత్తా చాటిందన్నారు. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించడంతో పాటు ఆరేడు స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నామని దీన్ని బట్టి రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందని, 14 నుంచి 35.08 శాతం ఓటింగ్ శాతం పెరిగితే కాంగ్రెస్ కు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగిందన్నారు.

దేశంలోనే అలాంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ సర్కార్:
సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినా, కాంగ్రెస్ పార్టీ దొండి ఆట ఆడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ సిట్టింగ్ సెగ్మెంట్ మల్కాజిగిరిలో, సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ లో మేమే గెలిచామన్నారు. చాలా చోట్ల మాకు ఎమ్మెల్యేలు లేకపోయినా ఆ స్థానాల్లో బీజేపీకి మెజార్టీ వచ్చిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి అండగా ఎన్నికల ఫలితాల్లో ఇంకా ఎవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుని తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమిష్టిగా కలిసి ముందుకు వెళ్తామన్నారు. ఈ దేశంలో అధికారంలోలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ సర్కార్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉచిత బస్సు ప్రయాణం హమీ మినహా ఏదీ అమలు చేయడం లేదని, రానున్న రోజుల్లో ప్రజల పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువచ్చేలా కార్యచరణ తీసుకుంటామన్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story