- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ అని రాష్ట్ర హోంమంత్రి మహముద్ అలీ అన్నారు. నూతనంగా నిర్మించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను ఇవాళ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డీజీపీ అంజనికుమార్, సీపీ స్టీఫెన్ రవీంద్రతో కలిసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా పెరుగుదలకు అనుకూలంగా నూతన పోలీస్ స్టేషన్లను నిర్మిస్తున్నదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి కమండ్ కంట్రోల్ వ్యవస్థను హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు , కర్ఫ్యూలు జరగలేదంటే పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.