‘ఆ స్టేట్‌మెంట్లు చెల్లవ్.. ఒత్తిడి చేసి చెప్పించిన తప్పుడు సాక్ష్యాలు’

by Gantepaka Srikanth |
‘ఆ స్టేట్‌మెంట్లు చెల్లవ్.. ఒత్తిడి చేసి చెప్పించిన తప్పుడు సాక్ష్యాలు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసుపై రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తరపు లాయర్ కీలక కామెంట్లు చేశారు. మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50లో భాగంగా ఈడీ అధికారులు పలువురు సాక్షులు, అప్రూవర్ల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారని, కానీ అవన్నీ వారిపై ఒత్తిడి చేసి చెప్పించిన సాక్ష్యాలంటూ ఆమె తరఫున లాయర్ మోహిత్‌రావు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపులో భాగంగా మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా మోహిత్‌రావు మరికొన్ని కీలక వాదనలూ లేవనెత్తారు. సాక్షులపై ఒత్తిడి తెచ్చి వాంగ్మూలాలను రికార్డు చేసినందున అవి న్యాయపరంగా చెల్లుబాటు కావన్నారు. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయడాన్ని వీడియోలో చిత్రీకరించినందున ఆ ఫుటేజీని, ఆడియో టేప్‌లను అందజేయాలని కోర్టును కోరారు.

ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శ‌ర‌త్‌చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా క‌వితపై ఈడీ ఆరోప‌ణ‌లు చేసిందని, ఆమెపై కేసులు నమోదు చేసిందని, కానీ ఇది సమంజసం కాదని న్యాయవాది మోహిత్‌రావు వాదించారు. శ‌ర‌త్‌చంద్రారెడ్డితో లావాదేవీలు జ‌రిగాయంటూ ఈడీ ఆరోపిస్తున్నప్పటికీ చాలాకాలంగానే ఆయనతో కవితకు ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని, అవన్నీ బ్యాంకుల ద్వారానే జరిగాయని, వారి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నారు. సాక్షుల్ని, అప్రూవర్‌లుగా మారినవారిని ఈడీ అధికారులు ఒత్తిడి చేసి స్టేట్‌మెంట్లను రికార్డు చేసినందువల్ల వాటిని కవితపై కేసులు పెట్టడానికి ప్రామాణికంగా తీసుకోలేమని, వీడియోలో షూట్ చేసినందున వాటిని పరిశీలించి తదనుగుణంగా బలమైన వాదనలు వినిపించేందుకు ఫుటేజీని అందించాలని కోర్టును న్యాయవాది మోహిత్‌రావు కోరారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను సెప్టెంబరు 2వ తేదీ వరకు పొడిగిస్తూ స్పెషల్ జడ్జి ఆదేశాలు ఇచ్చు.

Advertisement

Next Story

Most Viewed