ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో వన్ మ్యాన్ షో ఉండదు

by GSrikanth |
ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో వన్ మ్యాన్ షో ఉండదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దీనిని మంగళవారం సాయంత్రం అధికారింగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం ప్రకటన అనంతరం కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పార్టీలోని సీనియర్లందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో వన్ మ్యాన్ షో ఉండబోదని స్పష్టం చేశారు. ఏ నిర్ణయమైనా పార్టీలో చర్చించాకే సమిష్టిగా తీసుకుంటామని తెలిపారు. కాగా, డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రొటోకాల్ అధికారులు కాన్వాయ్ సిద్ధం చేయగా, రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు.

Advertisement

Next Story