- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాకు ప్రాణహాని ఉందని పోలీసులే చెప్తున్నారు: మాజీ ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతల నుంచి తనకు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ప్రాణ హాని ఉందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆరోపించారు. డీజీపీని కలిసిన అనంతరం బీరం మీడియాతో మాట్లాడుతూ.. కుట్రపూరితంగానే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో గాయపడ్డ బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాధుడే లేడని అసహనం వ్యక్తం చేశారు. గువ్వల తనకు, బాలరాజుకు ప్రాణహాని ఉందని, రక్షణ ఇవ్వాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసామని తెలిపారు. మహిళలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. దాడిలో గాయపడి చికిత్స తీసుకుంటున్న వారి దగ్గరికి వచ్చి ప్రాణహాని ఉందని నేరుగా పోలీసులే చెప్తున్నరని అన్నారు. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మంగళవారం ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కొందరు వ్యక్తులు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేసి ఆయన్ను గాయపరిచారు ఇంట్లోని కుర్చీలు, తలుపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
Read More...
BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్.. మాల్ స్వాధీనం చేసుకున్న TSRTC