- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్తర తెలంగాణకే ముప్పు తెచ్చేలా KCR ప్రకటన.. రాష్ట్రంలో సరికొత్త వివాదానికి తెరలేపిన CM..!
దిశ, తెలంగాణ బ్యూరో: నాందేడ్ బీఆర్ఎస్ సభ ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. విపక్షాలు, రైతులు సీఎం కేసీఆర్ ప్రకటనపై మండిపడుతున్నారు. రాజకీయ స్వార్ధం కోసం రైతుల పొట్టకొట్టే ప్లాన్ చేస్తున్నారని విమర్శలు మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం నాందేడ్‌లో జరిగిన బహిరంగ సభ తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర రైతులకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగు నీళ్లు ఇవ్వొచ్చని ప్రకటించారు. దీనిపై ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎస్సారెస్సీ నీళ్లను పొరుగు రాష్ట్రానికి ఇవ్వొచ్చని చెప్పేందుకు కేసీఆర్ ఎవరు? అనే ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర హక్కులకు ఎసరు..
రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు దక్కాల్సిన నీళ్ల వాటాలో అన్యాయం జరిగిందని స్వయంగా సీఎం కేసీఆర్ పలుసార్లు అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్ మహారాష్ట్ర ప్రజలకు శ్రీరాంసాగర్ నీళ్లను ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని చెప్పడంపై అర్థం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై కేసీఆర్ చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కృష్ణానదిపై నిర్మిస్తోన్న సంగమేశ్వరం ప్రాజెక్టు విషయంలో మొదట్నించి మౌనంగా ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం టెండర్లు పిలిచినా పట్టించుకోలేదు. మహబూబ్ నగర్ రైతులు ఆందోళనలు చేసినా స్పందించలేదు. రైతులే స్వయంగా కోర్టుకు వెళ్లి, సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని పిటిషన్ వేశారు. చివరికి తెలంగాణ సర్కారు ఆ పిటిషన్‌లో ఇంప్లీడ్ మాత్రం అయ్యింది.
తెలంగాణ పదం, నినాదాల తొలగింపు..
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ పార్టీ పేరులోంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించారు. దీనిపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ అనే పదం లేకపోతే మనుగడ కష్టమని ఆందోళన వారికి పట్టుకుంది. పార్టీ పేరు విషయం ఆయన సొంత వ్యవహారం. కానీ ఏకంగా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన హక్కులకు ముప్పు తెచ్చే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారని చర్చ మొదలైంది. ఎస్సారెస్పీలోని నీళ్లను మహారాష్ట్ర రైతులకు ఇస్తామని చెప్పడానికి ఆయనకు హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు.
ఉత్తర తెలంగాణ రైతుల్లో ఆందోళన..
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉత్తర తెలంగాణలోని మెజార్టీ భూములు సాగు అవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన రైతులకు ఉన్న ఏకైక ప్రాజెక్టు. ఒకవేళ మహారాష్ట్రకు ఎస్సారెస్పీ నీళ్లల్లో వాటా ఇస్తే సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ నీళ్లను మహారాష్ట్రకు మళ్లిస్తే మా పరిస్థితి ఏంటీ? అనే ఆందోళన ఆ ప్రాంత రైతుల్లో నెలకొంది.
కేసీఆర్ చేసిన ప్రకటన ఇదే..
''మహారాష్ట్రతో తెలంగాణ ఉన్న నీటి వివాదాలపై ఇరు ప్రభుత్వాలు కూర్చోని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో కొందరు లీడర్ల డ్రామా. ఇది చిన్న ప్రాజెక్టు. వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే ఇది పెద్ద విషయమే కాదు. మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరమైతే ఎస్సారెస్పీలో ఉన్న నీరు మహారాష్ట్రాకు ఇచ్చే అవకాశం ఉంది'' అని అన్నారు.
రైతులకు తీరని ద్రోహం; మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
సొంత రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ రైతలు పొట్టకొడుతుంటే ఊరుకోమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శ్రీరాం సాగర్ నీళ్లను మహారాష్ట్రకు ఇచ్చేందుకు రెడీ అని కేసీఆర్ చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబ్లీ ప్రాజెక్టుపై ఆందోళన చేసిన లీడర్లు ఇప్పుడు కొందరు కేబినెట్‌లో ఉన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రకటనపై వారంతా ఏం సమధానం చెపుతారని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి : కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. వచ్చే నెలలో ఖాళీ కానున్న మూడు స్థానాలు!