చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన సాగింది:కేటీఆర్‌

by Jakkula Mamatha |
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన సాగింది:కేటీఆర్‌
X

దిశ,వెబ్‌డెస్క్: నేడు(సెప్టెంబర్ 26) వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే కేసీఆర్‌ పాలన సాగిందని తెలిపారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపిన తెగువ అందరికీ ఆదర్శమని తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు చిట్యాల ఐలమ్మ అన్నారు. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమం లో భాగస్వామ్యం కావడంలో ఆమె స్ఫూర్తి ఎక్కువ అని తెలిపారు. ఉద్యమ పోరాటంలో మహిళల పాత్ర అసమానమైనది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ.

ఈ రోజు(గురువారం) ఆమె జయంతి సందర్భంగా మహనీయురాలు చాకలి ఐలమ్మను స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగిందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక చొరవతో చిట్యాల ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారని కేటీఆర్ గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed