అసెంబ్లీలో తాత, తండ్రి, మనువడు.. తాత స్పీచ్‌ను ఇంట్రెస్టింగ్ విన్న హిమాన్షు

by Satheesh |
అసెంబ్లీలో తాత, తండ్రి, మనువడు.. తాత స్పీచ్‌ను ఇంట్రెస్టింగ్ విన్న హిమాన్షు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ చివరి రోజు సమావేశాలకు సీఎం కేసీఆర్ మనువడు హిమాన్షు అసెంబ్లీ వచ్చారు. విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నారు. తాత కేసీఆర్ తెలంగాణ ప్రగతిపై ఇచ్చిన స్పీచ్‌ను ఆధ్యాంతం ఆసక్తిగా విన్నారు. హిమాన్షుతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కూడా వచ్చారు. హిమాన్షును చూసిన మంత్రి కేటీఆర్ సభలో ఉండి హలో అని చెప్పారు.

వెంటనే ఎమ్మెల్యే బిగాల గణేష్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి లాబీకి వచ్చి హిమాన్షుతో మాట్లాడి వెళ్లారు. అయితే తాత, తండ్రి అసెంబ్లీలో ఉండటం, హిమాన్షు విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఘటన ఆసక్తిగా మారింది. ముగ్గురు అసెంబ్లీకి రావడం చర్చకు దారితీసింది. ముందుగా హిమాన్షుకు పలువురు సిబ్బంది స్వాగతం పలికారు.

Advertisement

Next Story

Most Viewed