ఆ కారణంగా టికెట్ ధరలు పెంచక తప్పడం లేదు: డిప్యూటీ సీఎం పవన్

by Mahesh |   ( Updated:2025-01-04 16:47:15.0  )
ఆ కారణంగా టికెట్ ధరలు పెంచక తప్పడం లేదు: డిప్యూటీ సీఎం పవన్
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ప్రముఖ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబోలో ఈ నెల 10న గేమ్ చేంజర్(Game changer) సినిమా ప్రపంచ వ్యాప్తంగా(Worldwide) విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు రాజమండ్రి వేదికగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం(Deputy CM) పవన్ కల్యాణ్(Pawan Kalyan) ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టికెట్ ధరల పెంపు(Ticket Prices Increase) పై కీలక వ్యాఖ్యలు చేశారు. "తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. దీంతో సినిమాల బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్‌ సప్లయ్‌ ఆధారంగా టికెట్‌ రేట్ పెంచుకోవడంలో తప్పులేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. దీనికి ముందు సినిమాలు హిట్ అయినంత మాత్రాన, పెద్ద హోదా దక్కినంత మాత్రాన.. మనం ఎక్కడి నుంచి వచ్చామో మూలాలు మర్చిపోకూడదని.. నేనైనా, చరణ్‌ అయినా చిరంజీవి ఆశీస్సులవల్లే ఇలా ఈ స్థానంలో ఉన్నామని.. ఏ హీరో అయినా.. తాము ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడంటూ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో అయిన పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story