defeat: ఓటమి బాధ నుంచి బయటపడలేకపోతున్నారా.. నిపుణులు చెప్పిన బెస్ట్ టిప్స్ మీ కోసం

by Anjali |
defeat: ఓటమి బాధ నుంచి బయటపడలేకపోతున్నారా.. నిపుణులు చెప్పిన బెస్ట్ టిప్స్ మీ కోసం
X

దిశ, వెబ్‌డెస్క్: జీవితంలో ప్రతిఒక్కిరు సక్సెస్ వైపు అడుగులు వేస్తారు. కానీ కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారు. మరికొంతమంది ఓటమి పాలవ్వడంతో.. ఇందులో పలువురు డిప్రెషన్ కు వెళ్లిపోతారు. అయ్యే అంతా కష్టపడ్డానే ఎందుకు ఇలా అయ్యింది..? ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాను అంటూ తమలో తామె అనేక ప్రశ్నలతో సతమతమవుతుంటారు. అయితే ఇలాంటి వారు ఓటమి బాధ నుంచి బయటకొచ్చేందుకు నిపుణులు పలు చిట్కాలు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఓటమి తర్వాత విశ్రాంతి అవసరం. మైండ్ నుంచి అన్ని ఆలోచనల్ని తీసేయ్యాలి. బాధను మనసుకు తీసుకోకూడదు. బాధ నుంచి కంప్లీట్ గా డైవర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. కాగా ఆ సమయంలో మీకు నచ్చిన పనులు చేయండి. ఇష్టమైన వారితో గడపండి.

ఫైవ్ మినిట్స్ రూల్ పాటించండి. కేవలం మీ బాధ, ఏడుపు మొత్తం ఐదు నిమిషాల్లోనే ఉండాలి. తర్వాత అన్నీ వదిలేయండి. బాధపడకుండా ఓటమి నుంచి అనేక విషయాలు నేర్చుకోండి. ప్రతి ఒక్కటి ఏదోక పాఠం నేర్పిస్తుంది. ముఖ్యంగా ఓటమి నేర్పని పాఠమే విలువైనది అని గ్రహించండి.

అలాగే కొత్త లక్ష్యాలు పెట్టుకోండి. అందులో ఓడిపోయానే అనే బాధను పక్కన పెట్టి... వేరే దారిలో వెళ్లండి. లేక అదే మళ్లీ ప్రయత్నించండి. కానీ బాధపడడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిపోతారని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story