‘ఎలక్షన్స్ అప్పుడే కేసీఆర్‌కు పీవీ గుర్తొస్తారు’

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-28 08:42:47.0  )
‘ఎలక్షన్స్ అప్పుడే కేసీఆర్‌కు పీవీ గుర్తొస్తారు’
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పీవీ జయంతి సందర్భంగా పీవీ ఘాట్ లో ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.దక్షిణ భారత దేశం నుంచి పీఎం అయిన ఏకైక వ్యక్తి పీవీ అన్నారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని ఎన్నికలప్పుడే కేసీఆర్ అడుగుతారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పీవీని స్మరించిన కేసీఆర్‌కు ఇప్పుడేమైందన్నారు. ఓట్లు దండుకోవడం ఎలాగో కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. పీవీని కాంగ్రెస్ గతంలో అవమానిస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా అవమానిస్తూనే ఉందన్నారు. గతంలో పీవీ ఘాట్ ను కూల్చేస్తామని కొందరు మూర్ఖులు అన్నారని గుర్తు చేశారు.

Read More: తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు?

Advertisement

Next Story